Oct 12,2023 11:46

ప్రజాశక్తి-సామర్లకోట : ప్రజాశక్తి-సామర్లకోట : జిల్లాలోని సామర్లకోటలో వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీల్లో లబ్దిదారులకు ఇళ్లను సీఎం జగన్‌ అందించారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల నిర్మాణం కార్యక్రమంలో భాగంగా సామర్లకోటలో నిర్మించిన ఇళ్లను సీఎం జగన్‌ లబ్దిదారులకు గురువారం లబ్దిదారులతో గహా ప్రవేశం చేయించారు. సామర్లకోటలో లబ్దిదారులతో సామూహిక గహ ప్రవేశాల కార్యక్రమంలో సీఎం జగన్‌ పాల్గొన్నారు. అక్కడి గృహ నిర్మాణాల ఎగ్జిబిషన్‌ను తిలకించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు బయలుదేరారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు బయలుదేరారు. సామర్లకోటలో సీఎం పర్యటన నేపథ్యంలో సామర్లకోట పట్నం జనసంద్రంగా మారింది. సామర్లకోట జూనియర్ కళాశాల గ్రౌండ్స్ లో జరగనున్న భారీ బహిరంగ సభకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో చేరుకుంటున్నారు.

  • పెద్దాపురం, సామర్లకోటలలో సిఐటియు నాయకుల గృహ నిర్బంధాలు 

భారత రాజ్యాంగం కల్పించిన ప్రాధమిక హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తోందని సిఐటియు కాకినాడ నగర కమిటీ  విమర్శించింది. ఈ మేరకు సిఐటియు  జిల్లా కోశాధికారి మలక వెంకట రమణ, నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు లు గురువారం సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి సభ పేరుతో సిఐటియు జిల్లా నాయకుడైన దారపురెడ్డి క్రాంతి కుమార్,  పెద్దాపురం సిఐటియు ఉపాధ్యక్షులు నీలపాల సూరిబాబులను పెద్దాపురంలో, జిల్లా నాయకులైన బాలం శ్రీనివాస్ ను సామర్లకోటలో గృహ నిర్బంధాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎందుకు గృహ నిర్బంధం చేస్తున్నారో కనీసమైన నోటీసు కూడా ఇవ్వకుండా పోలీసు వారు వ్యవహరిస్తున్న తీరు చాలా అభ్యంతరకరంగా, అప్రజాస్వామికంగా ఉందన్నారు. సదరు కార్యకర్తల కుటుంబ సభ్యులు అనారోగ్యంతో ఉన్నా ఆసుపత్రికి కూడా తీసుకెళ్ళడానికి కూడా అవకాశం ఇవ్వకపోవడం చాలా దారుణమన్నారు. ముఖ్యమంత్రి సభకు ఎవరైనా చట్టవిరుద్ధంగా ఆటంకం కల్పిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు గాని, ఈవిధంగా గృహ నిర్బంధాలతో మానవ హక్కులు లేకుండా చేయడం ఎమర్జెన్సీని తలపిస్తుందని ఆరోపించారు. ప్రజాస్వామ్య వాదులంతా రాష్ట్ర ప్రభుత్వ పోలీసు చర్యలను ఖండించాలన్నారు. ప్రభుత్వ యంత్రాంగం తమవైఖరి మార్చుకోవాలని లేనిపక్షంలో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

cm jagan