Mar 28,2023 21:25
  • కిర్గిజ్‌ రిపబ్లిక్‌పై భారత్‌ గెలుపు

ఇంఫాల్‌(మణిపూర్‌): మూడు దేశాల అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో ఆతిథ్య భారత జట్టు ఘన విజయం సాధించింది. మంగళవారం కిర్గిజిస్థాన్‌తో తలపడిన భారతజట్టు 2-0గోల్స్‌ తేడాతో గెలిచింది. తొలి అర్ధభాగం 34వ ని.లో బ్రాండాన్‌ కొట్టి ఫ్రి కిక్‌ను సందేశ్‌ జింఘాన్‌ గోల్‌గా మలిచాడు. దీంతో భారతజట్టు తొలి అర్ధభాగం ముగిసే సమయానికి 1-0 ఆధిక్యతలో నిలిచింది. ఇక రెండో అర్ధభాగం 84వ ని.లో భారత్‌కు మరో పెనాల్టీ కార్నర్‌ లభించగా.. ఈసారి కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రీ ఆ బంతిని గోల్‌గా మలిచాడు. దీంతో భారతజట్టు 2-0 ఆధిక్యతలోకి దూసుకెళ్లింది. ఇంఫాల్‌లోని ఖుమాన్‌ లంపాక్‌ స్టేడియంలో ఫ్లడ్‌లైట్ల వెలుగలో ఈ మ్యాచ్‌ జరిగింది. భారత జట్టు తదుపరి మ్యాచ్‌ను మయన్మార్‌తో తలడపనుంది. అంతకుముందు మయన్మార్‌తో జరిగిన తొలి మ్యాచ్‌ను కిర్గిజిస్థాన్‌ 1-1తో డ్రా చేసుకోవడంతో ఫైనల్‌కు చేరాలంటే చివరి మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంది. ఇక భారత జట్టు ఫైనల్‌కు చేరాలంటే మాత్రం చివరి లీగ్‌ మ్యాచ్‌లో మయన్మార్‌పై డ్రా చేసుకున్నా సరిపోతుంది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరుకావడం విశేషం.