Jul 20,2023 07:15
  •  కుళాయిల ఏర్పాటులో భిన్న వసూళ్లు
  • 10 శాతం సేవా రుసుము పెంపుపైనా కసరత్తు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : మరో సరికొత్త బాదుడుకు రాష్ట్ర ప్రభుత్వం తెరతీస్తోరది. ఇళ్లు, ఆస్తి, చెత్త వరటి వాటిపై పన్నులతో వాతలు పెడుతున్న ప్రభుత్వం తాజాగా తాగునీటిపై పన్ను పెంచేందుకు రంగం సిద్ధం చేస్తోరది. దీంతోపాటు సేవా రుసుము కూడా వసూలు చేయనుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను తు.చ. తప్పక పాటిస్తూ.. ప్రజలపై సైలెంటుగా భారాలు మోపడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం వెనుకాడడం లేదు. నీటి పన్ను పెంపు, సేవారుసుము వడ్డింపునకు సంబంధించి ప్రణాళిక సిద్ధం చేయాలని ఇప్పటికే అధికారులను పురమాయించింది.
పట్టణ సంస్కరణల పేరిట నీటి పన్నును కనీసం 10 శాతం పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రధానంగా ఇళ్లకు వినియోగిరచే తాగునీటిపై ఈ భారం పడనుంది. తాగునీటి కోసం ఏర్పాటు చేసుకునే కుళాయి కనెక్షన్లకు ఇప్పటికే కొరత పన్నును వసూలు చేస్తుండగా, రానున్న కాలంలో అదనంగా చెల్లించాల్సి వుంటుంది. ఈ పన్నుతోపాటు కుళాయిలకు సంబంధించిన రంగాల్లో కొరత సేవా రుసుమును కూడా వసూలు చేయాలన్న ప్రతిపాదన వుంది. కొత్తగా కుళాయి కనెక్షన్‌కు దరఖాస్తు చేసుకున్న వారి నురచి కొరత వసూలు చేయనున్నారు. అలాగే ఇంటిలో అదనపు కుళాయి సౌకర్యం కావాలన్నా సేవా రుసుము వసూలు చేయాలని భావిస్తున్నారు. ఒక ఇరటి నురచి ఇరకో ఇరటికి మారే సమయంలో కుళాయి కనెక్షన్‌ను మార్చుకోవాలనుకున్న వారి నురచి సేవా పన్ను వసూలు చేయనున్నారు. ఒకసారి కనెక్షన్‌ తీసుకున్న తరువాత దానిని రద్దు చేసుకోవాలని భావించినా సేవా రుసుము చెల్లించక తప్పదు.

  • మురుగుపైనా రుసుమే..

ఇళ్ల మురదు నుంచి వెళ్లే మురుగు కాల్వలను శుభ్రం చేసే సమయంలో దానిపై కూడా ఇళ్లలో నివశిరచేవారి నురచి కొరత సేవా రుసుమును వసూలు చేసే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోరది. నీటి పన్ను, మురుగు పన్నులపై ఒకే విధమైన విధానాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.

  • పాత ఉత్తర్వుల సవరణపై..

తాగునీరు, మురుగు తొలగిరపులపై పన్నులు, సేవా రుసుములు 2020లోనే ఇచ్చిన ఉత్తర్వులను కూడా సవరించే ఆలోచన చేస్తున్నారు. కొత్తగా అమలు చేయనున్న ఛార్జీలు, రుసుములతో త్వరలో కొత్త ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఈ కొత్త ఉత్తర్వులు 2024 జనవరి నుంచి అమల్లోకి రానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.