ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడు వైఎస్ భాస్కర్ రెడ్డికి 12 రోజుల ఎస్కార్ట్ బెయిల్ మంజూరైంది. అనారోగ్య కారణాల రీత్యా 15 రోజుల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ భాస్కర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సిబిఐ కోర్టు న్యాయమూర్తి బుధవారం తీర్పు ప్రకటించారు. భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై రెండ్రోజుల క్రితమే వాదనలు పూర్తయ్యాయి. భాస్కర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై చంచల్‌గూడ జైలు అధికారులు న్యాయస్థానానికి నివేదిక సమర్పించారు. దానిని పరిశీలించిన సిబిఐ కోర్టు భాస్కర్‌రెడ్డికి 12 రోజుల ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేస్తూ బుధవారం తీర్పు ప్రకటించింది.