Sep 19,2023 20:56

హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడు శివశంకర్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఏ-5 నిందితుడిగా ఉన్న శివ శంకర్‌రెడ్డి తనకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ గతంలో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై గత నెల 24న వాదనలు ముగిశాయి. ఆయన బెయిల్‌ పిటిషన్‌పై ఆగస్టు 28న ఉత్తర్వులిస్తామని సీబీఐ కోర్టు తెలిపింది. అయితే, బెయిల్‌పై మరిన్ని వాదనలు వినాలని కోరుతూ ఆగస్టు 28న శివశంకర్‌ రెడ్డి మరో పిటిషన్‌ వేశారు. దీనిపై సెప్టెంబరు 4న విచారణ చేపట్టిన న్యాయస్థానం.. తాజాగా బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.