Sep 12,2022 14:30

ప్రజాశక్తి-నందిగామ (ఎన్‌టిఆర్‌) : ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సిఐటియు నందిగామ మండల కార్యదర్శి కటారపు గోపాల్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం నందిగామ లక్మీ ప్రసన్న సెంటర్లో ఆటో స్టాండ్‌ వద్ద ఆటో కార్మికుల సంతకాలు సిఐటియు ఆధ్వర్యంలో సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, పెట్రోల్‌, కీనిర్‌, గ్యాస్‌ ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. భారీ జరిమానాలు వేసే జిఓ నెం.21 రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆటోల కొనుగోలుకు బ్యాంక్‌ ద్వారా తక్కువ వడ్డీతో రుణాలు మంజూరు చేయాలన్నారు. గ్రీన్‌ టాక్స్‌, ఈ- చలనాలు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈకార్యక్రమంలో ఆటో కార్మికుల యూనియన్‌ నాయకులు రవి తదితరులు పాల్గొన్నారు.