ఆసియాకప్ 2023కి సంబంధించిన హక్కులను బ్రాడ్‌కాస్ట్ సంస్థ స్టార్‌స్పోర్ట్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, నేపాల్ జట్లు టైటిల్ కోసం పోటీపడతాయి. ఆరు జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. ఒక గ్రూప్‌లో భారత్, పాకిస్తాన్, నేపాల్... మరో గ్రూప్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ జట్లున్నాయి. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఈ టోర్నీని నిర్వహిస్తారు. పాకిస్తాన్‌లో 4 మ్యాచ్‌లు... శ్రీలంకలో 9 మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఆసియా కప్‌కు సంబంధించిన ప్రోమోను శుక్రవారం తన ట్విటర్‌లో రిలీజ్ చేసింది.''ఈ ఏడాది చివర్లో జరగనున్న వన్డే వరల్డ్‌కప్ కొట్టడానికి ముందు ఆసియా కప్ కొట్టండి.. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకొండి'' అంటూ టీమిండియాను ఎంకరేజ్ చేస్తూ బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చిన మాటలు ఆకట్టుకున్నాయి. స్టార్‌స్పోర్ట్స్ రిలీజ్ చేసిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
All eyes on Asia as we gear up for an ultimate showdown in the #AsiaCup2023!
— Star Sports (@StarSportsIndia) June 17, 2023
Join #TeamIndia's exhilarating journey as they intend to conquer first the Asia Cup & then the World Cup #AajAsiaKalDuniya
Watch Asia Cup LIVE from Aug 31-Sep 17, only on Star Sports Network pic.twitter.com/b1tcPlZ6dn










