Mar 16,2023 07:30
  • యుపి వారియర్స్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలుపు

ముంబయి: మహిళల ప్రిమియర్‌ లీగ్‌(డబ్ల్యుపిఎల్‌)లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ) జట్టుకు ఊరట లభించింది. వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడిన బెంగళూరు జట్టు బుధవారం యుపి వారియర్స్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన యుపి వారియర్స్‌ జట్టు 19.3ఓవర్లలో 135పరుగులకు కుప్పకూలింది. ఛేదనలో బెంగళూరు జట్టు 18ఓవర్లలో 5వికెట్లు కోల్పోయి 136పరుగులు చేసి గెలిచింది. టాస్‌ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన యుపికి బెంగళూరు బౌలర్లు డివైన్‌(23/2), శోభన (2/27), ఫెర్రీ (16/3) కట్టడి చేశారు. దీంతో యుపి జట్టు 31పరుగులకే 5వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ దశలో గ్రేస్‌ హర్రీస్‌(46), నవ్‌గైర్‌ (22) దీప్తి(22) బ్యాటింగ్‌లో రాణించడంతో యుపి జట్టు ఆ మాత్రమైనా స్కోర్‌ చేయగల్గింది. ఛేదనలో బెంగళూరు జట్టు 60 పరుగులకే 4వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డట్లు కనిపించినా.. కనిక అహూజా(46), రీచా ఘోష్‌(31నాటౌట్‌), హీదర్‌ నైట్‌(24) రాణించి మ్యాచ్‌ను ముగించారు. ఈ గెలుపుతో బెంగళూరు జట్టు దాదాపు ప్లే-ఆఫ్‌ నుంచి నిష్క్రమించుకుందనుకున్న దశలో మళ్లీ రేసులోకి వచ్చింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ఎలీసా ఫెర్రీకి లభించింది.
యుపి మహిళల ఇన్నింగ్స్‌: హీలీ (సి)శోభన (బి)సోఫీ డివైన్‌ 1, దేవిక వైద్య (ఎల్‌బి)సోఫీ డివైన్‌ 0, కిరణ్‌ నవ్‌గైర్‌ (సి)రీచా ఘోష్‌ (బి)శోభన 22, మెక్‌ గ్రాత్‌ (సి)రీచా ఘోష్‌ (బి)స్కట్‌ 2, గ్రేస్‌ హర్రీస్‌ (సి)రీచా ఘోష్‌ (బి)ఎలీసా ఫెర్రీ 46, సిమ్రన్‌ షైక్‌ (సి)అహూజా (బి)శోభన 2, దీప్తి శర్మ (సి)శ్రేయాంక (బి)ఎలీసా ఫెర్రీ 22, శ్వేతా సెహ్రావత్‌ (బి)ఎలీసా ఫెర్రీ 6, ఎక్లేస్టోన్‌ (రనౌట్‌) దిశా కసత్‌ (బి)శ్రేయాంక 12, అంజలి శర్వాణి (సి)అహూజ (బి)శ్రేయాంక 8, గైక్వాడ్‌ (నాటౌట్‌) 2, అదనం 12. (19.3ఓవర్లలో ఆలౌట్‌) 135పరుగులు. బౌలింగ్‌: సోఫీ డివైన్‌ 4-0-23-2, స్కట్‌ 4-0-21-1, రేణుక సింగ్‌ 2-0-20-0, శోభన 4-0-27-2, ఎలీసా ఫెర్రీ 4-0-16-3, శ్రేయాంక 1.30-21-1.
బెంగళూరు మహిళల ఇన్నింగ్స్‌: సోఫీ డివైన్‌ (సి)మెక్‌ గ్రాత్‌ (బి)హర్రీస్‌ 14, స్మృ తి మంధాన (బి)దీప్తి శర్మ 0, ఎలీసా ఫెర్రీ (సి)ఎక్లేస్టోన్‌ (బి)దేవిక వైద్య 10, హీథర్‌ నైట్‌ (సి)కిరణ్‌ నవ్‌గైర్‌ (బి)దీప్తి శర్మ 24, కనిక అహూజా (బి)ఎక్లేస్టోన్‌ 46, రీచా ఘోష్‌(నాటౌట్‌) 31, శ్రేయాంక (నాటౌట్‌) 5, అదనం 6, (18ఓవర్లలో 5వికెట్ల నష్టానికి) 136పరుగులు. బౌలింగ్‌: హర్రీస్‌ 3-0-28-1, దీప్తి శర్మ 4-0- 26-2, రాజేశ్వరి 4-0-35-0, ఎక్లేస్టోన్‌ 4-0-20-1, దేవిక 2-0-19-1, అంజలి 1-0-4-0
డబ్ల్యుపిఎల్‌లో నేడు..
ఢిల్లీ క్యాపిటల్స్‌ × గుజరాత్‌ జెయింట్స్‌
(వేదిక: బ్రాబౌర్న్‌ స్టేడియం, సమయం: రాత్రి 7.30గం||లకు)