ప్రజాశక్తి-విజయవాడ రూరల్ : వినాయక నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా రామవరప్పాడు రైవస్ కాల్వలో వినాయక నిమజ్జనం చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో బత్తుల శ్రీకాంత్ అలియాస్ శామ్యూల్ (19) అనే యువకుడు మృతి చెందాడు. సాయినగర్లో ఏర్పాటైన వినాయక ప్రతిమ నిమజ్జన ఊరేగింపులో పాల్గొన్న శ్రీకాంత్ నిమర్జనం సమయంలో కాల్వలో పడి గల్లంతయినాడు. మృతదేహాన్ని కాల్వలో నుండి ఎస్.డి.ఆర్.ఎఫ్ సిబ్బంది వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.










