Apr 08,2023 14:34
  • ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు.

ప్రజాశక్తి-రైల్వేకోడూరు : రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ముఖ్యమంత్రి వైఎస్ జగనన్న లక్ష్యమని ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. శనివారం వైసిపి పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రం గత నాలుగు సంవత్సరాలుగా సంక్షేమం,అభివృద్ధి దిశలో పయనిస్తుందని అందులో భాగంగా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సాహకారంతో దేశంలోని ప్రముఖ100 దిగ్గజ కంపెనీలతో రాజంపేటలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని అందులో రాజంపేట కోడూరు నియోజకవర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఉపాధి కోసం ఏర్పాటు చేశామని, పదవ తరగతి నుంచి పీజీ వరకు చదివిన నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి కల్పించాలని ఈ జాబ్ మేళాను ఈనెల 15వ తేదీన రాజంపేటలో నిర్వహిస్తున్నామని నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. గతంలోనూ రెండు పర్యాయాలు జాబ్ మేళాలు నిర్వహించి ఎంతోమందికి ఉద్యోగాలు కల్పించామని దాదాపు పదివేల మందికి పైగా ఉద్యోగాలు కల్పించడమే ఈ జాబ్ మేళా లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రామిరెడ్డి ప్రజారెడ్డి వ్యవసాయ సలహా మండలి జిల్లా చైర్మన్ సుకుమార్ రెడ్డి వైసిపి రాష్ట్ర ప్రచార కార్యదర్శి సి.డి నాగేంద్ర యాదవ్ మండల కన్వీనర్ సుధాకర్ రాజు టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ సాయి కిషోర్ రెడ్డి, టి రాజేంద్ర, సర్పంచులు రామకృష్ణ, సుబ్రహ్మణ్యం రాజు, హరికృష్ణ రెడ్డి, ఈశ్వరయ్య, రమణారెడ్డి, సిహెచ్ రమేష్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.