Dec 27,2022 22:02

మాట్లాడుతున్న కలెక్టర్‌

మాట్లాడుతున్న కలెక్టర్‌
యువతకు ఉపాధి కలిగించడమే లక్ష్యం
ప్రజాశక్తి-బిట్రగుంటమండలంలో యువతకు ఉపాధి కలిగించడమే ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తుందని కావలి నియోజకవర్గ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. బోగోలు మండలం, జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ పనులను కలెక్టర్‌ చక్రధర్‌ బాబు, కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి సందర్శించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ యువతకు ఉపాధి కల్పన అభివద్ధి లక్ష్యంగా రాష్ట్రంలో 9 షిప్పింగ్‌ హార్బర్లను నిర్మిస్తున్నారన్నారు. జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ ప్రాంతం పర్యాటక కేంద్రంగా గుర్తింపబడిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక స్కీముల నుంచి అభివద్ధి కోసం నిధులను మంజూరు చేస్తుందని, ఇండిస్టియల్‌ పరంగా కావలి నియోజకవర్గంలో రామాయపట్నం, జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌కు జాతీయ రహదారికి దగ్గరగా ఉండటం సరుకు రవాణాకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
యువతకు ఉపాధి కల్పన, గ్రామాల అభివద్ధికి ఎంతగానోఉపయోగ పడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కావలి ఆర్‌డిఒ శీనా నాయక్‌, తహశీల్దార్‌ లక్ష్మీనారాయణ, ఎంపిడిఒ గోవిందరాజులు, తదితరులు పాల్గొన్నారు.