లోకేష్‌తో కలసి పాదయాత్రలో పాల్గొన్న 'పల్లె' తదితరులు
కొత్తచెరువు : చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో పులిచెర్ల మండలం కొత్తపేటలో నారా లోకేష్ శుక్రవారం నిర్వహించిన యువగళం పాదయాత్రకు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తన సంఘీభావం తెలిపారు. పుట్టపర్తి నియోజకవర్గంలోని తన మద్దతుదారులతో కలసి వెళ్లి సంఘీభావం తెలిపారు. ఉదయం నుండి సాయంకాలం వరకు ఆయన వెంట పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాసులు, మండల కన్వీనర్ రామకృష్ణ, టౌన్ కన్వీనర్ వలిపి శ్రీనివాసులు, పుట్టపర్తి కన్వీనర్ రామాంజనేయులు, విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.










