Mar 12,2023 12:19

న్యూఢిల్లీ  :  ఢిల్లీ మహిళా కమిషన్‌ చీఫ్‌ స్వాతి మలివాల్‌ ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నతనంలో తన తండ్రి తనను లైంగికంగా వేధించాడని అన్నారు. తనను చిన్నతనంలో తన నాన్న లైంగికంగా వేధించేవాడని, ఆయన ఇంటికి వస్తున్నాడంటేనే భయపడిపోయేదాన్నని, మంచం కింద దాక్కునే దాన్నని పేర్కొన్నారు. దీంతో ప్రతిరాత్రి ఆడవారికి ఎలా సహాయం చేయాలని, పిల్లలను వేధించే పురుషులకు ఎలా గుణపాఠం చెప్పాలని ప్రతి రాత్రి ప్లాన్‌ చేసేదాన్నని అన్నారు. తాను నాలుగవ తరగతి చదివే వరకు తన తండ్రితో కలిసి జీవించానని, ఈ విధంగా చాలసార్లు జరిగిందని అన్నారు. తన పోనీటెయిల్‌ను పట్టుకుని గోడకేసి కొట్టేవాడని, తల నుండి రక్తం కారిందని అన్నారు. ఒక వ్యక్తి చాలా వేధింపులకు గురైనపుడు, అతను ఇతరుల బాధను అర్థం చేసుకుంటాడని తాను విశ్వసిస్తున్నానని అన్నారు. అది మొత్తం వ్యవస్థను కదిలించే అగ్నిని మేల్కలుపుతోందని అన్నారు. తాను ఎనిమిదేళ్ల వయసులో లైంగిక వేధింపులకు గురైనట్లు చెప్పారు. ''భార్యాపిల్లల్ని చిత్రహింసలు పెట్టడం, కన్న కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడడాన్ని జన్మహక్కుగా భావించే వ్యక్తి వల్ల నా తల్లి వైవాహిక బంధంలో ఇబ్బందులు పడింది. ఎనిమిదేళ్ల వయసులోనే నేను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని నటి, బిజెపి నేత ఖుష్బూ సుందర్‌ పేర్కొన్నారు.