Nov 11,2022 16:40

ప్రజాశక్తి-జగ్గయ్యపేట : పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర హై స్కూల్ క్రీడా మైదానం నందు జరుగుతున్న జగనన్న క్రీడా సంబరాలు శుక్రవారంతో ముగిసాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వవిప్, జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ సభ్యులు సామినేని ఉదయభాను నియోజకవర్గ స్థాయిలో గెలిచిన క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించేందుకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగనన్న క్రీడా సంబరాలను ఏర్పాటు చేశారని, నియోజకవర్గ స్థాయిలో జరిగిన కబడ్డీ, క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్ మొత్తం పోటీలలో స్త్రీలు, పురుషులు కలిపి 73 మంది విజేయతలుగా నిలిచారనీ, త్వరలో జరగనున్న జిల్లా, జోన్, రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో పాల్గొననున్న జగ్గయ్యపేట క్రీడాకారులు సమర్థవంతంగా ఆడి విజేతలుగా నిలవాలని, తద్వారా తల్లిదండ్రులకు, జగ్గయ్యపేటకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, వైస్ చైర్మన్ తుమ్మల ప్రభాకర్, పట్టణ అధ్యక్షులు ఆకుల శ్రీకాంత్ బాజీ, ఎస్టీ సెల్ అధ్యక్షులు బద్దు నాయక్, కౌన్సిలర్ గింజుపల్లి వెంకట్రామయ్య, సొసైటీ అధ్యక్షులు సామినేని లక్ష్మీనారాయణ, నాయకులు ఫిరోజ్ ఖాన్, కాశీ కిషోర్, కన్నమాల శామ్యూల్, శ్రీనివాసరావు, ఎన్ఎస్పి సైదా, గేమ్స్ కో ఆర్డినేటర్ శ్రీనివాసరావు, వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.