ప్రజాశక్తి-విజయవాడ
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజ్‌కు భారీ స్థాయిలో వరద నీరు చేరుకుంటుందని బ్యారేజ్ నుంచి దిగువకు 5 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ యస్ డిల్లీ రావు తెలిపారు. కష్ణలంక రణదీవే నగర్, సత్యం గారి దొడ్డి, సాయిబాబా గుడి సమీపంలో ముంపునకు గురైన గహాలను శనివారం రాత్రి జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ సెంట్రల్ మండలంలో 14 గహాలు, తూర్పు మండల పరిధిలో 12 గహాలు ముంపుకు గురైనట్లు గుర్తించామన్నారు. ప్రస్తుతం వరద నీరు నిలకడగా ఉందన్నారు. వరద మరింత పెరిగినప్పటికీ ప్రజలకు ఇబ్బందులు లేకుండా సహాయక చర్యలు చేపట్టేందుకు అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసిల్దార్ వెన్నెల శ్రీనివాస్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగమల్లేశ్వరరావు తదితరులు ఉన్నారు.










