వంశీరెడ్డి సేవలు స్ఫూర్తిదాయకం
ప్రజాశక్తి-కోవూరు : జన్మనిచ్చిన తల్లిదండ్రులను పుట్టిన ఊరును మరిచిపోకుండా అమెరికాలో ఉంటూ సొంత ఊరి రుణం తీర్చుకుంటూ సామాజిక సేవా కార్యక్రమాల్లో నిమగమైన వంశీధర్ రెడ్డిని ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఎంఎల్‌ఎ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కొనియాడారు. ఇనమడుగు పంచాయతీ జమ్మిపాలెం గ్రామంలో మాత పరమేశ్వరీదేవి ఆలయం చుట్టూ తన సొంత నిధులతో నాలుగు లక్షలు వేచించి ప్రహరీ గోడ నిర్మాణం చేసిన వంశీధర్ రెడ్డిని ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించి శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించి సన్మానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి సభ్యులు దొడ్డం రెడ్డి నిరంజన్‌బాబురెడ్డి మాట్లాడుతూ ఇనమడుగు గ్రామంలో దేవాలయాలు రక్తదాన శిబిరాలు మహిళలకు ముగ్గులు పోటీలు నిర్వహించి లక్షలాది రూపాయలు వ్యయం చేస్తున్న వంశీధర్ రెడ్డి సేవలో అభినందిస్తున్నామన్నారు. ఇటువంటి వ్యక్తి వల్ల గ్రామాలు అభివృద్ధి పథంలో పయనిస్తాయన్నారు. కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, నాగార్జున కన్‌స్ట్రక్షన్స్ అధినేత వసంత కుమార్‌రెడ్డి, సెంట్రల్ రైల్వే డిఆర్ యుయుసి నెంబర్ మారంరెడ్డి రామకృష్ణారెడ్డి, పడుగుపాడు సొసైటీ చైర్మన్ ఆర్‌ఎంఆర్, జెడ్‌పిటిసి శ్రీలత, ఎంపిపి పార్వతి, సచివాలయాలు కన్వీనర్ కవరగిరి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.










