Jan 02,2023 20:04

దేవాలయానికి విరాళం అందిస్తున్న దాత

ప్రజాశక్తి -కందుకూరు :కందుకూరు శ్రీ అంకమ్మ తల్లి ఆలయ పునర్‌ నిర్మాణం కోసం ఎంఎల్‌ఎ మానుగుంట మహీధర్‌ రెడ్డి కృషి చేస్తున్నారు. ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అమ్మవారి పాదాల చెంత ఉంచే సువర్ణ యంత్రానికి సోమవారం మొల్లమూరి శ్రీనివాస్‌ భార్య ప్రశాంతి కుమారుడు మనో సాత్విక్‌ ఒక గ్రామ బంగారం కొరకు నగదు రూపంలో రూ.5116లు ఇచ్చారు. ఎనిమిరెడ్డి వెంకటరెడ్డి, గుమ్మళ్ల వెంకట్రావు పాల్గొన్నారు.