Feb 25,2023 21:17

మాట్లాడుతున్న ఎంపి ఆదాల

మాట్లాడుతున్న ఎంపి ఆదాల
వీలైనంత త్వరగా ఇళ్ల పట్టాలు ఇప్పిస్తాం
నెల్లూరు:నారాయణ రెడ్డి పేట, కోడూరుపాడు ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వం నుంచి వీలైనంత త్వరగా పట్టాలిప్పిస్తామని ఎంపి ఆదాల ప్రభాకర్‌రెడ్డి హామీ ఇచ్చారు. శనివారం సీనియర్‌ వైసిపి నేత లచ్చారెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 100 మంది నారాయణరెడ్డిపేట, కోడూరుపాడు ప్రాంతాల నుంచి ఆదాల నివాసానికి విచ్చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎంపి మాట్లాడుతూ ఈ రెండు ప్రాంతాల నేతలతో గతంలో సయోధ్య కుదిర్చి, ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చామని చెప్పారు. అయితే అప్పటి శాసనసభ్యులు ఆనం వివేకానందరెడ్డి వాటిని రద్దుచేసి, ఎన్నికల రాబోతున్న తరుణంలో మళ్లీ ఇచ్చారని,అది కూడా పూర్తిగా జరగలేదన్నారు. 2014లో తాను రూరల్‌ నియోజకవర్గ బాధ్యతలు చేపట్టా నని గుర్తు చేశారు.
అప్పుడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. కొన్ని కారణాలవల్ల ఇంకా 300 మందికి పట్టాలు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. వీలైనంత త్వరగా అక్కడ పర్యటించి వివాదాలు లేని స్థలాన్ని పరిశీలించి, పట్టాలుగా పంపిణీ చేసేందుకు కషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ నేత లచ్చా రెడ్డి మాట్లాడుతూ చేనేతలకు 9 అంకణాల స్థలమిస్తే దానిని ఆదాల ప్రభాకర్‌ రెడ్డికి చెప్పి 12 అంకణాలకు మార్పించామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్‌ రంగారెడ్డి, కోడూరు కమలాకర్‌ రెడ్డి, కార్పొరేటర్లు నాగరాజు, మేకల రామ్మోహన్‌ యాదవ్‌, అంజిరెడ్డి, సుధాకర్‌ యాదవ్‌, స్వర్ణ వెంకయ్య, నాగారెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి, పేర్నేటి కోటేశ్వర్‌ రెడ్డి, అల్లా బక్షు తదితరులు పాల్గొన్నారు.