Apr 25,2023 21:56

ఫొటో : అధికారులను అభ్యర్థిస్తున్న దళితనాయకులు

వీడియో కాన్ఫరెన్స్‌లతో కాలం సాగదీయడం అన్యాయం
ప్రజాశక్తి-కావలి : జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా వీడియో కాన్ఫరెన్స్‌ల పేరుతో కాలం వెళ్లబుచ్చటం అన్యాయమని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు మల్లి పేర్కొన్నారు. మంగళవారం ఆర్‌డిఒ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మల్లి మాట్లాడుతూ జిల్లా అధికారులందరూ కూడా ఉదయం 9 గంటల నుండి కాన్ఫరెన్స్‌ 11 గంటలకి సెట్‌ కాన్ఫరెన్స్‌, రెండు గంటల నుంచి కలెక్టర్‌ కాన్ఫరెన్స్‌, నాలుగు నుంచి సాయంత్రం 5 దాకా జాయింట్‌ కలెక్టర్‌ కాన్ఫరెన్స్‌, ఈ విధంగా ప్రతినిత్యం కాన్ఫరెన్స్‌ల పేరుతో కాలం సాగదీయడం అన్యాయమని తెలియజేశారు. సమస్యలతో కార్యాలయానికి వచ్చే ప్రజలు ఎదురుచూపులు తప్పడం లేదని తెలియజేశారు.
వేసవిలో సమస్యలు చెప్పుకోవాలని వస్తే అధికారులు జగనన్న పేరుతో కాలయాపన చేస్తున్నారని తెలియజేశారు. ఈ మేరకు ఆర్‌డిఒ కార్యాలయంలో నిరసన తెలిపిన వారు జగనన్న తమ బాధలు ఆలకించండంటూ నిరసన తెలిపారు. ఇకనుండి పేద ప్రజల సమస్యలను పరిష్కరించాలని సెట్‌ కాన్ఫరెన్స్లతో కాలయాపనలు చేయొద్దని విన్నవించారు. పేదవారికి ఏమైనా రుణాలు ఇస్తున్నారా.. భూ పంపిణీ చేస్తున్నారా.. పేదవాడి న్యాయం కోసం సెల్‌ కాన్ఫరెన్స్‌లు పెడుతున్నారా.. ఎవరి కోసం సెట్‌ కాన్ఫరెన్స్‌లు పెడుతున్నారని ప్రశ్నించారు. ఈ విషయంపై జగనన్నకి ఉత్తరం రాస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో జడ్డా వాసు, జరుగుమల్లి విజయరత్నం, తదితరులు పాల్గొన్నారు.