ప్రజాశక్తి - లింగసముద్రం :విద్యార్థి దశలోనే లక్ష్యాలను ఏర్పరుచుకుని ఆదిశగా ప్రణాళిక బద్ధంగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఎంఎల్‌ఎ మానుగుంట మహీధర్‌రెడ్డి ఆకాంక్షించారు. శనివారం ఆయన తిమ్మారెడ్డిపాలెం వద్ద ఉన్న ఎపి మోడల్ స్కూల్ 9వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి సిఎం అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. నాడు-నేడు, అమ్మవడి,జగనన్న విద్యాకానుక వంటి పథకాలు గ్రామీణ పేద విద్యార్థులు విద్యారంగంలో ఉన్నత స్థాయికి చేరేందుకు దోహదపడుతున్నాయన్నారు. అనతరం విద్యా సంవత్సరంలో మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్ధులను సర్టిఫీకేట్లు,షీల్డులు అందజేశారు. మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎస్.ఎం హఫ్తార్ అధ్యక్షత వహించారు. తిమ్మారెడ్డి పాలెం సర్పంచ్ కె.పద్మావతి,వైసిపి మండల కన్వీనరÊ పిచ్చపాటి తిరుపతిరెడ్డి, మండల వైసిపి మీడియా అధికార ప్రతినిధి వరికూటి క్రిష్ణారెడ్డి,పలు గ్రామా సర్పంచ్‌లు,ఎంపిటిసి సభ్యులు,స్కూల్ కమిటి చైర్మన్ కుమ్మిత వెంకట రమణయ్య ఉన్నారు.










