ప్రజాశక్తి - తలుపుల: మండల పరిధిలోని తలుపుల,ఉబ్బరవాండ్లపల్లి, గుండువారిపల్లి, ఓబుళరెడ్డిపల్లి, కుర్లి పాఠశాల పరిధిలోని పదవ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్ష ఫీజును తలుపుల ఉపసర్పంచి డికె బాబు చెల్లించారు. 310 మంది విద్యార్థులకు 44 వేలు నగదును ఆయా పాఠశాలల హెచ్‌ఎంలకు అందజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సురేష్ బాబు, విశ్వనాథరెడ్డి, రామచంద్ర, రామచంద్రారెడ్డి, నజమునిషా బేగం, మాజీ సర్పంచి ఫయాజ్, కాలేజ్ కమిటీ చైర్మన్ అంజి, ప్రభువర్ధన్, దివాన్ వలి, మౌలా, రమేష్ ,శ్రీధర్, గంగరాజు, గంగాధర తదితరులు పాల్గొన్నారు.
పారిశుధ్య కార్మికులకు ఆర్థికసాయం : తలుపుల మేజర్ పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు నడి వీధి గంగమ్మ జాతరకు సందర్భంగా ఉపసర్పంచి డికె బాబు ఆర్థికసాయం అందజేశారు. పారిశుధ్య కార్మికులకు రూ. 25 వేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ డిపి ఫయాజ్ అహ్మద్, ప్రభువర్ధన్, మౌలా, రమేష్, శ్రీధర్, గంగరాజు, శ్రీనివాసులు, పారిశుధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.










