Nov 24,2022 21:59

సమావేశంలో మాట్లాడుతున్న ప్రిన్సిపల్‌ ప్రగతి

          హిందూపురం : విద్యార్థినుల ఉజ్వల భవిష్యత్తే లక్ష్యంగా మహిళా కళాశాలల్లో విధులు నిర్వహిస్తున్న అధ్యాపకులు పని చేస్తున్నారని ఎన్‌ఎస్‌పిఆర్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ ఎం.ప్రగతి కోరారు. గురువారం స్థానిక కళాశాలలో ఏర్పాటు చేసిన తల్లిదండ్రుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తమ కళాశాలలో వారి కుమార్తెలను చేర్చినందుకు తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. వారి నమ్మకానికి తగినట్లుగా అధ్యాపకులు అంకిత భావంతో విద్యార్థినులను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. కంప్యూటర్‌ క్లాసులు, పోటీ పరీక్షల కోసం క్లాసులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో వైస్‌ ప్రిన్సిపల్‌ తిరుమలమ్మ, డిప్యూటీ వార్డెన్‌ సరస్వతి, అధ్యాపకులు వెంకటేశులు, శ్రీలక్ష్మి, యశోదా రా