Sep 09,2023 23:05

సైకిల్‌ యాత్రలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

జి.కొండూరు : ఎస్‌ఎఫ్‌ఐ సైకిల్‌ యాత్ర మూడో రోజు ఎస్సి హాస్టల్‌, జి.కొండూరు సెంటర్‌లో సభ నిర్వహించారు. ఈ యాత్ర విద్యార్థులు సమస్యలు తెలుసుకొనేందుకు ఆ సమస్యల పరిష్కారానికై ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ జిల్లా విద్యారంగ అభివద్ధికై ఎస్‌ఎఫ్‌ఐ సంఘర్షణ సైకిల్‌ యాత్ర చేపట్టారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సిహెచ్‌ వెంకటేశ్వరరావు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు జి.గోపినాయక్‌, తెలిపారు. జి.కొండూరు మండల కేంద్రంలో ఎస్‌ఎఫ్‌ఐ సంఘర్షణ సైకిల్‌ యాత్రను వివిధ ప్రాంతాల్లో నిర్వహించారు. విద్యార్థులను సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ సంఘర్షణ సైకిల్‌ యాత్రలో భాగంగా జిల్లాలో 7 నియోజకవర్గాల్లోని 10 రోజులు పాటు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు, కళాశాలలు, హాస్టల్లో సమస్యలు తెలుసుకుని ఆ సమస్యల పరిష్కారం కోసం సైకిల్‌ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. 16వ తేదీ విజయవాడలో ఈ యాత్ర ముగుస్తుందన్నారు. జిల్లాలో సంక్షేమ హాస్టళ్లకు సొంత బిల్డింగులు నిర్మించాలని, మెస్‌ ఛార్జీలు పెంచాలని, పెండింగ్లో ఉన్న కాస్మోటిక్‌ చార్జీలు విడుదల చేయాలని, మెడికల్‌ క్యాంపులు నిర్వహించాలని, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయాలని, కొత్తగా మంజూరు చేసిన జూనియర్‌ కళాశాలను ఏర్పాటు చేయాలని, డిగ్రీలో తీసుకొచ్చిన హానర్స్‌, మేజర్‌ - మైనర్‌ సబ్జెక్టు విధానాన్ని రద్దు చేయాలని, జిల్లాలో గ్రామాలకు వెళ్లే బడి బస్సుల సంఖ్య పెంచాలని, జిల్లాలో ప్రభుత్వ ఐటిఐ, పాలిటెక్నిక్‌ కళాశాలలో సమస్యలు పరిష్కరించాలని, పి.జి లో తీసుకొచ్చిన జీవో నెంబర్‌ 77 ను రద్దు చేసి, విద్యా దీవెన అమలు చేయాలని, ప్రభుత్వ స్కూల్‌, జూనియర్‌, డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులను భర్తీ చేయాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని, తదితర డిమాండ్లతో ఈ యాత్ర చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.సోమేశ్వరరావు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్‌ ఎస్‌. కె జాహిదా, జిల్లా ఉపాధ్యక్షులు కుమార్‌ నాయక్‌, మన్మధ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు కుమారస్వామి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ సభ్యులు మాధవ్‌, రిజ్వాన్‌,జి.కొండూరు సిఐటియు మండల కార్యదర్శి బాలకష్ణ, రైతు సంగం మండల కార్యదర్శి శ్రీనువాసురావు, తదితరులు పాల్గొన్నారు.