ప్రజాశక్తి-బుక్కపట్నం/రొద్దం బుక్కపట్నం, రొద్దం మండల కేంద్రాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. అయితే ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల వరుసగా రెండు పెద్ద పెద్ద విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకోవడంతో విద్యుత్ స్తంబాలు అంటేనే ప్రజలు జడుసుకుంటున్నారు.
బుక్కపట్నం మండల కేంద్రంలోని పౌరసరఫరాల సంస్థ ప్రదేశంలో గురువారం ఉదయం ఒక్కసారిగా విద్యుత్ స్తంభం నేలకొరిగింది. దీంతో కొన్ని చెట్లు కూడా పడిపోయాయి. అయితే ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఒక్కసారిగా రెండు విద్యుత్ స్తంభాలు నేలకొరడంతోపాటు చెట్లు కూలిపోవడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అయితే స్థానికులు వెంటనే అప్రమత్తం కావడంతో పెద్దప్రమాదం తప్పినట్లయింది. కాగా విద్యుత్ స్తంభాలు దెబ్బతిని ప్రమాదస్థాయిలో ఉన్నాయని, వాటిస్థానంలో కొత్త స్తంబాలు బిగించాలని సంబంధిత అధికారులకు విన్నవిస్తున్నా పట్టిచుకోవడం లేదని సర్పంచి, స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకునొ తుప్పు పట్టిన స్తంభాలను తొలగించి నూతన విద్యుత్ స్తంభాలను అమర్చించి ప్రమాదాలు జరగకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.
రొద్దం మండల కేంద్రంలోని పెనుకొండ పావగడ ప్రధాన రహదారిలో గురువారం పెను ప్రమాదమే తప్పింది. మండల కేంద్రంలోని ప్రధాన రహదారిలో పెనుకొండ, పావగడ ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా వచ్చాయి. రోడ్డు ఇరుకుగా ఉండటంతో విద్యుత్ వైర్లకు తగిలి స్తంభం కింద పడిపోయింది. అయితే స్థానికులు వెంటనే అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. మండల కేంద్రంలోని ప్రధాన రహదారి ఇరుకుగా ఉంటుంది. దీనికితోడు దుకాణాల వద్ద వాహనాలను రోడ్డుకు అడ్డంగా పెడుతూ ఉంటారు. దీంతో మరింత ఇరుకుగా మారుతూ ఉంటుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రధాన రహదారిపై వాహనాలను రోడ్డుకు అడ్డంగా ఉంచకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
రొద్దం మండలంలో ఆర్టీసీ బస్సు ఢకొీనడంతో నేలకొరిగిన విద్యుతథ స్తంభం










