Apr 19,2023 19:20

ప్రచారం చేస్తున్న దృశ్యం

ప్రజాశక్తి -కందుకూరు : ఎంఎల్‌ఎ మానుగుంట మహీధర్‌ రెడ్డి ఆధ్వర్యంలో జగనన్నే మా భవిష్యత్తు మా నమ్మకం నువ్వే జగన్‌ కార్యక్రమంలో భాగంగా బుధవారం 10వ వార్డు బూడిద పాలెం 6వ సచివాలయ పరిధిలో ప్రతి ఇంటికి తిరిగారు. ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. పట్టణ అధ్యక్షులు రఫీ, గంగిరెడ్డి, సచివాలయ కన్వీనర్లు రాజేష్‌, రహీం, వాలంటీర్లు, సారధులు ఉన్నారు.
ఉలవపాడు : మండలంలోని వీరేపల్లి గ్రామ సచివాలయం పరిధిలో బుధవారం జగనన్నే మా భవిష్యత్‌ కార్యక్రమంలో గ్రామ సచివాలయంలోని పడమటి యానాది కాలనీలో ప్రతి ఇంటికి తిరిగి జగన్నన ప్రవేశపెట్టిన పథకాలు ద్వారా ఏవిధంగా లబ్ధి పొందుతున్నారు అని తెలుసుకుని గహ యజమానుల అంగీకారంతో గహలకు జగనన్నే మా నమ్మకం స్టిక్కర్లును అంటిచారు. సర్పంచ్‌ కాకర్లపూడి వెంకటసుదారాణి, సచివాలయ కన్వీనర్లు లకంరాజు వెంకట్రావమ్మ, పంచాయతీ వైస్‌ ప్రెసిడెంట్‌ పొట్టేళ్ల మాల్యాద్రి, మాజీ సర్పంచ్‌ నన్నం పోతురాజు, గ్రామపార్టీ అధ్యక్షుడు లకంరాజు శ్రీనివాసరాజు ఉన్నారు.