ప్రజాశక్తి-కొండపి : రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న వైసిపి ప్రభుత్వాని తరిమి కొట్టాలని కొండపి ఎమ్మెల్యే డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. స్థానిక టిడిపి కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి తెలుగుదేశం, జనసేన నాయకులతో మంగళవారం ఆత్మీయ సమ్మెళన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టిడిపి, జనసేన పార్టీ నాయకులు కలిసి పనిచేసి వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్రెడ్డి తరిమి కొట్టాలన్నారు. చిన్నచిన్న సమస్యలను ఉంటే సర్దుబాటు చేసుకొని అందరు కలిసి పనిచేయాలన్నారు. ఈనెల 17 నుంచి గ్రామాలలో భవిష్యత్తు గ్యారెంటీ ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా ఓటరు జాబితాను పరిశీలించాలన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలు, వైసిపి ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రజలకు వివరించాలన్నారు. టిడిపి మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరించాలన్నారు. ఈనెల 18,19 తేదీల్లో అధ్వానంగా ఉన్న రోడ్ల దుస్థితిపై నిరసన చేపట్టాలన్నారు. ఈ టిడిపి కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ ఉపాధ్యక్షుడు జి.రామయ్యచౌదరి, నియోజకవర్గ టిడిపి, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.