Mar 04,2023 22:20

విలేకర్ల సమావేశంలో పాల్గొన్న నాయకులు

ధర్మవరం టౌన్‌ : ఎమ్మెల్సీ ఎన్నికలే తొలిమెట్టుగా భావించి రాష్ట్రంలో వైసిపికి చరమగీతం పాడుదామని టిడిపి ధర్మవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్‌, గుంటూరు జిల్లాపెదకూరపాడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్‌ టిడిపి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. టిడిపి స్థానిక కార్యాలయంలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడారు.. వైసీపీ అధికారంలోకి వచ్చిప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులతోపాటు నిరుద్యోగులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిఅధికారం చేపట్టాక వారిని మోసం చేశారన్నారు. చేనేత రంగానికి చెందిన వారు చాలా మంది సొంత వృత్తిని వదులుకోలేక తిరిగి స్వగ్రామానికి వచ్చి మగ్గంపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. అయితే వైసీపీ ప్రభుత్వంలో చేనేతలకు ఒక్క సబ్సీడీ కూడా ఇవ్వలేదన్నారు. ఇక ఉపాధ్యాయుల పరిస్థితి చూస్తే వారిచేతనే పాఠశాలలో చేయలేని పనులు చేయిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను యువత, ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా చూపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కమతంకాటమయ్య, చారుగుండ్ల ఓబుళేశు, పరిశే సుధాకర్‌, పురుషోత్తంగౌడ్‌, సాహెబ్బీ, బీబీ, కృష్ణాపురం జమీర్‌ అహమ్మద్‌, గరుగువెంగప్ప, భీమనేని ప్రసాద్‌ నాయుడు, పల్లపురవీంద్ర, బిల్లే శీన, ఇర్షాద్‌, గొట్లూరు రహీం, లోకేష్‌ తదితరులు పాల్గొన్నారు.