May 02,2023 20:20

సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్యెల్యే షాజహాన్‌ బాషా


మదనపల్లె అర్బన్‌ : ఎపిని రాజధాని లేని రాష్ట్రంగా చేసిన ఘనత వైసిపికే దక్కుతుందని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని జగన్‌ సర్కార్‌ ఖూనీ చేస్తోందని మదనపల్లె మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌ బాషా ఆరోపించారు. మంగళవారం స్థానిక టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ముఖ్యమంత్రి జగన్‌దేనన్నారు. 33 వేల ఎకరాల భూమిని రైతులు ప్రభుత్వానికి అప్పగిస్తే వారిపైనే అరాచకం చేయడం దూర్మార్గమన్నారు. రాష్ట్రంలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో ఇంటింటికీ వెళ్లి బలవంతంగా స్టిక్కర్లు వేయడాన్ని తప్పుపట్టారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఏలాంటి కేసులు లేవన్నారు. నాలుగు ఏళ్ల కాలంలోనే ప్రభుత్వ వ్యవస్థలన్నింటిని వైసిపి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ద్వజమెత్తారు.టీచర్లపైన వున్న కక్ష్యతో విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. వివాద రహితుడైన రజనీకాంత్‌పై అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆరోపణలు చేయడాన్ని ఖండించారు. రాజంపేట పార్లమెంట్‌ అధికార ప్రతినిధి ఆర్‌.జె.వెంకటేష్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలనను ఎండ గట్టడానికే జగనాసుర వధ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఎస్‌.ఎ.మస్తాన్‌ మాట్లాడుతూ టిడిపి నిర్వహిస్తున్న భాదుడే బాదుడు, ఇదేం కర్మ రాష్ట్రానికి ప్రజల మన్ననులు అందుకుందన్నారు. సమావేశంలో నాయకులు నాదెళ్ల విద్యా సాగర్‌, షంషీర్‌, ఇంతియాజ్‌, రమణ, హరి, శ్రీరాములు, వేమయ్య మహబూబ్‌ బాషా, బండి అమర, శ్రీనివాసులు పాల్గొన్నారు.