Apr 25,2023 21:51

ఫొటో : సర్టిఫికెట్లు అందజేస్తున్న ఎంఎల్‌ఎ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి

వైసిపి ప్రభుత్వంలో మత్స్యకారులకు పెద్దపీట
ప్రజాశక్తి-ఇందుకూరుపేట : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంలో మత్స్యకారులకు పెద్దపీట వేస్తూ, వారి సంక్షేమానికి ప్రభుత్వం పాటిపడుతుందని ఎంఎల్‌ఎ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కుడితిపాలెం గ్రామంలో ఫిషరీస్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ నూతన కమిటీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ సర్టిఫికెట్లు మత్స్యకారులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి ఇబ్బంది పడుతున్న కుడితిపాలెం మత్స్యకారులకు మెరుగైన జీవనోపాధి కోసం ప్రభుత్వం అందిస్తున్న అన్ని పథకాలు వారికి చేరే విధంగా 169 మంది మత్స్యకారులతో ఫిషరీష్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీని ఏర్పాటు చేసి సర్టిఫికెట్లు అందజేశామన్నారు.
ప్రభుత్వం ద్వారా మత్స్యకారులకు సబ్సిడీపై బోట్లు, వలలు, టు వీలర్‌ లేదా త్రీ వీలర్‌, డీజిల్‌ సబ్సిడీ, మత్స్యకార భరోసాలాంటి ఎన్నో పథకాలు మత్స్యకారులకు వర్తింపజేస్తాయన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్‌ చైర్మన్‌ కొండూరు అనిల్‌, వైసిపి మండల అధ్యక్షులు మావులూరు శ్రీనివాసులరెడ్డి, రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్‌ గొల్లపల్లి విజరుకుమార్‌ యాదవ్‌, యువనేత దువ్వూరు కళ్యాణ్‌ రెడ్డి, జెడ్‌పి వైస్‌ చైర్మన్‌ శ్రీహరికోట జయలక్ష్మి, కుడితిపాలెం సర్పంచ్‌ నాయుడు సురేష్‌, నాయకులు, గ్రామస్తులు, అధికారులు పాల్గొన్నారు.