Nov 14,2023 23:39

సమస్యలు తెలుసుకుంటున్న డాక్టర్‌ ఉగ్ర నరసింహారెడ్డి

ప్రజాశక్తి - కనిగిరి : ప్రజా సమస్యలు పట్టని వైసిపి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని టిడిపి కనిగిరి నియోజక వర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి తెలిపారు. కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని అర్బన్‌ కాలనీలో మన ఊరు-మన ఉగ్ర కార్యక్ర మాన్ని మంగళవారం ఉదయం నిర్వహించారు. సాయంత్రం కనిగిరి మండలం బల్లిపల్లిలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉగ్ర ఇంటింటికీ తిరిగి చంద్రబాబు అరెస్టును, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉగ్ర నరసింహారరెడ్డి మాట్లాడుతూ నీటి సమస్య కూడా పరిష్కరించలేని దుస్థితిలో నేటి పాలకులు ఉన్నారని తెలిపారు. దీన్ని బట్టి ప్రజలపై ఈ ప్రభుత్వానికి ఏమేర ఆసక్తి ఉందో ఇట్టే తెలిసి పోతుందన్నారు. ఈ కార్యక్ర మంలో టిడిపి మండల అధ్యక్షుడు నంబుల వెంకటేశ్వర్లు, నాయకులు, రాజమళ్ళ శ్రీనివాసరెడ్డి, ముచ్చుమారి చెంచిరెడ్డి, షేక్‌ ఫిరోజ్‌, షేక్‌ అహ్మద్‌, తమ్మినేని వెంకటరెడ్డి, షేక్‌ బారా ఇమామ్‌, తమ్మినేని సురేందర్‌ రెడ్డి, పాలూరి సత్యం, చింతలపూడి తిరుపాలు, ఆర్‌వి. నారాయణ, బాలు, ఓబుల్‌ రెడ్డి, నంబుల కొండయ్య, బుల్లా బాల బాబు , కాసు హరికష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.