వైసిపి నేతలతో హోరెత్తిన ఉదయగిరి
ప్రజాశక్తి-ఉదయగిరి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గెలుపుపై వైసిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చేసిన నినాదాలతో ఉదయగిరి హోరెత్తింది. ఆదివారం నూతన సంవత్సరం సందర్భంగా ఎనిమిది మండలాల వైసిపి నాయకులు ఎంఎల్‌ఎ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రచార కార్యదర్శి శాంతికుమారికి పూల బొక్కేమ్ల శాలువాలతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా స్థానిక వైసిపి నాయకులు డీజే సౌండ్‌తో బాణసంచారాల నడుమ వైసిపి క్యాంప్ కార్యాలయం వరకు భారీ ఎత్తున నాయకులు కార్యకర్తలతో వెళ్లారు. కార్యదర్శి శాంతికుమారి కార్యకర్తల సమన్వయంతో కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉదయగిరి 5వ సారి ఎంఎల్‌ఎ మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అని నినాదాలు హోరెత్తించి ప్రజలను ఆకర్షితులను చేశారు. అనంతరం సచివాలయం బిట్-1లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెంచిన నూతన పెన్షన్‌ను లబ్ధిదారులకు ఎంఎల్‌ఎ ప్రచార కార్యదర్శి చేతుల మీదుగా అందజేశారు. అలాగే తెలుగు బాప్టిస్ట్ చర్చిలో జరుగు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని చర్చి నూతన క్యాలెండర్‌లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ అక్కి భాస్కర్ రెడ్డి, ఉపసర్పంచ్ ముర్తుజా హుస్సేన్, ఎంపిటిసి గొల్లపల్లి తిరుపతయ్య, సొసైటీ అధ్యక్షులు కల్లూరి రమణారెడ్డి, సర్పంచులు కల్లూరి వెంకటేశ్వర రెడ్డి, ఖిల్జీ సలీం, జిల్లా వక్ఫ్‌బోర్డ్ డైరెక్టర్ గడియాల్చి ఎస్థాని, నాయకులు కృష్ణారెడ్డి, ఉప్పుటూరి శ్రీనివాసులు, రోజా స్టూడియో పెంచలయ్య, ఎనిమిది మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.










