ధర్మవరం టౌన్ : దోచుకోవడం.. దాచుకోవడం తప్ప వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి శూన్యమని టిడిపి నాయకులు విమర్శించారు. శనివారం పట్టణంలోని 14వ వార్డులో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవడంతోపాటు పెరిగిన ధరలపై ఆరాతీశారు. ముఖ్యంగా నిత్యావసర సరుకుల ధరలు, ఇసుక మాఫియా, అభివృద్ధి పనులు, తాగునీరు. నిరుద్యోగం, కరెంటు సమస్య, రైతులకు గిట్టుబాటు ధర, మహిళా భద్రత వంటి వాటిపై ప్రజలు, రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మూడున్నరేళ్లుగా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు. అంతేగాకుండా ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించిన వారిపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో వైసిపికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కమతం కాటమయ్య, ఫణికుమార్, చింతలపల్లి మహేష్‌చౌదరి, చింతపులుసు పెద్దన్న, మేకల రామాంజనేయులు, విజరుసారధి, రాంపురం శీన, కెహెచ్ ప్రకాష్, పరిశే సుధాకర్, నాగూర్‌హుస్సేన్, కొతపేట అది, కేశగాళ్ల శీనా, ఉస్మాన్, తదితరులు పాల్గొన్నారు.
ఓబుల దేవర చెరువు :- మండల పరిధిలోని తుమ్మలకుంట్లపల్లి , పెద్ద సానివారి పల్లి గ్రామాల్లో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్ జయచంద్ర , ప్రధాన కార్యదర్శి పిట్ల సుధాకర్ , డాక్టర్ జాకీర్, కొండ ఈశ్వరయ్య, జయచంద్ర రెడ్డి, చాంద్‌బాషా, షబ్బీర్, షాను, ఓబుల్ రెడ్డి, కంచి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
రొద్దం : మండలం, వైసిపి హయాంలో రాష్ట్రం అధోగతి పాలైందని టిడిపి జిల్లా అధ్యక్షులు పార్థసారధి విమర్శించారు. మండలంలోని తురకాలపట్నం గ్రామంలో శనివారం నిర్వహించిన ఇదేమి ఖర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. వైసిపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ అధికార ప్రతినిధి రొద్దం నరసింహులు, మహిళా అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ, కన్వీనర్ నరహరి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ వెంకటరామిరెడ్డి, సీనియర్ నాయకులు రామక్రిష్ణప్ప, మాధవనాయుడు, మాజీ కన్వీనర్ చంద్రమౌళి,టైలర్ ఆంజనేయులు, ఈసీ హరీష్, అశ్వర్థనారాయణ, లీలావతి, సర్పంచి మంజు, తురకాలపట్నం నాగేంద్ర, బోయ శ్రీనివాసులు, ఉప్పర శ్రీనివాసులు, హరికష్ణ, షణ్ముఖ, లక్ష్మీపతి, శ్రీరామ, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.










