Jul 08,2021 15:18

ఏలూరు : వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని రైతు దినోత్సవంగా జరపడం హాస్యాస్పదమని మాజీ మంత్రి, టిడిపి సీనియర్‌ నాయకులు చినరాజప్ప అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రైతు ఆత్మహత్యలు, క్రాఫ్‌ హాలిడే వంటి ఘోరాలు వైఎస్‌ హయాంలోనే జరిగాయన్నారు. ఆనాడు రైతు వ్యతిరేక విధానాలకు వైఎస్‌ఆర్‌ శ్రీకారం చుట్టారని అన్నారు. ఇప్పడు ప్రాజెక్టుల పేరుతో ఆయన కొడుకు సిఎం జగన్‌ డబ్బులు లాగుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రైతును పట్టించుకునే పరిస్థితి ఎక్కడా లేదన్నారు. ఇప్పటికైనా రైతు సమస్యలను అర్థం చేసుకుని, సమస్యల పరిష్కా దిశగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.