ఒంటిమిట్ట : కడప జిల్లా ఒంటి మిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరిరోజైన శనివారం ఆలయ సమీపంలోని పుష్కరిణిలో చక్రస్నానం నేత్రపర్వంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని పుణ్య స్నానాలు ఆచరించారు. ఆలయంలో ఉదయం 4 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి ఆలయ శుద్ధి, ఆరాధన నిర్వహించారు. ఉదయం 9.30 గంటలకు శ్రీ లక్ష్మణ సమేత సీతా రాములవారు తిరుచ్చిలో, సుదర్శన చక్రత్తాళ్వార్ పల్లకిలో ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు వేంచేశారు. ఉదయం 10.30 నుండి 11 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. సీతారామ లక్ష్మణ సరసన చక్రత్తాళ్వార్లు పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంతో అభిషేకాలు అందుకున్నారు. అనంతరం అర్చ కులు వేదమంత్రోచ్ఛారణ నడుమ శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. రాత్రి 7 గంటలకు ధ్వజావ రోహణంతో శ్రీకోదండరామస్వామివారి బ్రహో త్సవాలు ముగిశాయి. కార్యక్ర మంలో డెప్యూటీ ఇఒ నటేష్ బాబు, సూప రింటెండెంట్ సుబ్రహ్మణ్యం, టెం పుల్ ఇన్‌స్పెక్టర్ ధనుంజయ, ఆలయ అర్చ కులు పాల్గొన్నారు. శ్రీ కోదండ రామస్వామివారి ఆలయంలో 10వ రోజు ఆదివారం సాయంత్రం 6 నుండి రాత్రి 9.00 గంటల వరకు పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నారు.










