వాల్మీకిపురం : వాల్మీకిపురం శ్రీపట్టాభిరాముడి సాలకట్ల బ్రహ్మోత్సవాలు బుధవారం పుష్పయాగంతో ముగిసాయి. స్వామివారికి పుష్పయాగం, మహానైవేద్యం, పుష్పప్రసాద వితరణ కార్యక్రమాలు టిటిడి వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ కన్నులపండువగా సాగింది. వేకువజామున స్వామివారికి సుప్రభాతం, శుద్ధి, పంచాంగ శ్రవణం, తోమాలసేవ, అర్చన, మొదటి గంట, బలి, శాత్తుమొర నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం వేడుకగా సాగింది. పుష్పయాగానికి తెచ్చిన 200 కిలోల వివిధ రకాల పుష్పాలను తిరుమాఢవీధుల్లో ఊరేగించి, పట్టాభిరామాలయంలో స్వామివారికి పుష్పయాగం, మహానైవేద్యం, పుష్పప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయం కిక్కిరిసింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, టిటిడి డిప్యూటి ఇఒ వరలక్ష్మి, సూపరింటెండెంట్ మునిచెంగల్‌రాయులు, సిబ్బంది నాగరాజ, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
- 3 పుష్పయాగం నిర్వహిస్తున్న వేదపండితులు










