Feb 24,2023 21:56

ఫొటో : వేలం నిర్వహిస్తున్న అధికారులు

వాహనాలు వేలం
ప్రజాశక్తి-ఉదయగిరి : పలు రకాల కేసుల్లో పట్టుబడిన వాహనాలకు సెట్‌ కార్యాలయ ఆవరణలో శుక్రవారం వేలం నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి కృష్ణ కిషోర్‌ రెడ్డి, ఆత్మకూరు సెబ్‌ సిఐ నయనతార ఆధ్వర్యంలో ఈ వేలం నిర్వహించారు. ఈ వేలంలో నాలుగు వాహనాలకు ప్రభుత్వం నిర్థేశిత ధర కంటే అదనంగా చేకూరిందని వారు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సబ్‌ కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.