Feb 26,2023 21:30

ఫొటో : మాట్లాడుతున్న సిఐ రామకృష్ణారెడ్డి

వాహనాల తనిఖీలు
ప్రజాశక్తి-ఇందుకూరుపేట : బైక్‌పై ట్రిబుల్‌ రైడింగ్‌ చేస్తున్న వాళ్లపై కొవూరు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ రామకృష్ణారెడ్డి ప్రత్యేక నిఘా ఉంచి వారిపై కేసులు నమోదు చేశారు. ఆదివారం మండలంలోని గంగపట్నం సింగిల్‌ రోడ్డు వద్ద కోవూరు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ రామకృష్ణారెడ్డి, ఇందుకూరుపేట ఎస్‌ఐ వాసు, సిబ్బంది కలిసి స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మీడియాతో మాట్లాడుతూ యువత పెడదారి పట్టకుండా చూడడం తమ బాధ్యత అన్నారు.
ముఖ్యంగా ట్రిపుల్‌ రైడింగ్‌ చేస్తున్న యువతపై, మద్యం సేవించి వాహనాల నడుపుతున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం కొన్ని వాహనాలను సీజ్‌ చేసి వాహన చోదకులకు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. అలాగే త్రిబుల్‌ రైడ్‌ చేస్తున్న వాహనచోదకులకు, మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వాళ్లకి, వారి కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్‌ రూల్స్‌ పాటిస్తూ నడుచుకోవాలని హితవు పలికారు.