ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని కార్మికులు, శ్రామికులు సోమవారం ఘనంగా జరుపుకున్నారు. వామపక్షాలు, వివిధ యూనియన్ల ఆధ్వర్యంలో ఎర్రజెండాను ఆవిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా వాడవాడలా అరుణ పతాకం రెపరెపలాడింది. రాయచోటి, మదనపల్లెలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్మికులు ఎర్రజెండాలు చేతపట్టి ఎక్కడికక్కడ దండుగా కదిలారు. ప్రదర్శనలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ విధానాలపై నిప్పులు చెరిగారు.
ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్
కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం పని గంటలు పెంచి కార్మిక హక్కులపై దాడి చేస్తున్న మోడీ ప్రభుత్వ విధానాలను పోరాటాల ద్వారా అడ్డుకోవాలని, మేడే స్ఫూర్తితో లేబర్ కోడ్ లను తిప్పి కొట్టడానికి ఐక్యంగా పోరాడాలని సిపియం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు పిలుపునిచ్చారు. సోమవారం అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అయిన మేడే సందర్భంగా వాడవాడలా ఎర్రజెండా రెపరెపలాడింది. గ్రామీణ ప్రాంతాల్లో 38 చోట్ల సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మేడే ను ఘనంగా నిర్వహించారు. సిఐటియు అనుబంధ సంఘాలు అంగన్వాడీ, ఆశా, ఆటో, హమాలీ, భవన నిర్మాణ కార్మికులు, కాంట్రాక్టు ఉద్యోగులు మేడే కార్యక్రమాలలో పాల్గొన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రతిజ్ఞ చేశారు. జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి.హరిశర్మ, అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.రాజేశ్వరి, సిపియం పట్టణ కార్యదర్శి డి.ప్రభాకర్‌రెడ్డి, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు యం.జయమ్మ, సిఐటియు పట్టణ అధ్యక్షులు ఎ.వెంకటేష్, హమాలీ యూనియన్ నాయకులు రమణరావు, భవన నిర్మాణ కార్మికుల సంఘం నాయకులు జయరాంలు వివిధ ప్రాంతాల్లో ఎర్రజెండాలు ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎనిమిది గంటల పనిదినాల కోసం 136 సంవత్సరాల క్రితం చేసిన పోరాటం ఇప్పటికీ, ఎప్పటికీ కార్మికులకు స్ఫూర్తిదాయకమని అన్నారు. పనిగంటలను ఎనిమిది నుంచి పన్నెండు, పదహారు గంటలకు పెంచాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. కాంట్రాక్టు విధానాన్ని ప్రోత్సహిస్తూ లక్షలాది ఖాళీలను భర్తీ చేయడం లేదని, ప్రభుత్వ రంగ రిక్రూట్‌మెంట్ చేయడం లేదని అన్నారు.మతోన్మాద ప్రచారాలు, మతపరమైన అల్లర్లు, సష్టించి దేశ ప్రజల ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ శక్తులు కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. మత విద్వేషం, ఉన్మాదం, ద్వేషపూరిత రాజకీయాల నుండి దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత కార్మి కవర్గానికి ఉందని గుర్తు చేశారు. సంఫ్‌ు పరివార్ శక్తుల ప్రయత్నాలను ప్రతిఘటించేందుకు పోరాటాలను జయప్రదం చేయాలన్నారు. సిఐటియు జిల్లా కోశాధికారి టి.హరి శర్మ మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం లేబర్ కోడ్‌ల పేరుతో కార్మిక హక్కులను దెబ్బతీయాలని చూస్తోందని పని గంటలు పెంచి కార్మిక హక్కులపై దాడి చేస్తున్న మోడీ ప్రభుత్వ విధానాలను పోరాటాల ద్వారా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కార్మికులు హక్కుల రక్షణ కోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపియం నాయకులు సాహిన, నాగరాజు, చంద్ర, లోకేష్, సురేంద్ర, సిఐటియు నాయకులు నాగరాజు, వెంకటరమణ, శివ, రెడ్డెప్ప తదితరులతో పాటు వివిధ సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. జిల్లా ఆస్పత్రిలో.. పట్టణంలోని జిల్లా ఆసుపత్రిలో ఎఐటియుసి నాయకులు జి.కష్ణ మూర్తి ఆధ్వర్యంలో ఎర్రజెండాను ఆవిష్కరించారు. అనేకమంది తమ ప్రాణాలను తణ ప్రాయంగా అర్పించి శ్రమదోపిడీపై విజయం సాధించారన్నారు. కార్యక్రమంలో కార్మికులు ఎం. పాండు రంగ య్య, గిరిబాబు, సురేష్, పార్వతి, అలివేలు, ఆదిలక్ష్మి, గుంటి, లక్ష్మి, శ్రీనివాసులు, స్వామి నాధం, రెడ్డెప్ప, వనజ, మనోహర, రెడ్డి, అధం, మౌలాలి, థిలాసి రమణ పాల్గొన్నారు.బిల్డింగ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో..బిల్డింగ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జె.శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి బివి.రమణ, కార్యదర్శి ఎస్.రెడ్డిసాహెబ్ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో బిల్డింగ్ వర్కర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్.మోదీన్‌బాషా, ఉపాధ్యక్షులు పి.రామాంజులు, పెయింటర్స్ యూనియన్, రాడ్ బెండర్స్ యూనియన్, కార్పెంటర్స్ యూనియన్, టైల్స్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. కార్మికులకు ఘన సన్మానం.. పట్టణంలోని శ్రీవారి గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులను మేడే సందర్భంగా జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనియర్ గంగారపు రాందాస్‌చౌదరి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానిం చారు. కార్యక్రమంలో ఐటిఐ విభాగ నాయకులు జగదీష్ , మదనపల్లె రూరల్ మండల అధ్యక్షులు గ్రానైట్ బాబు, జనార్ధన్ రెడ్డమ్మ పాల్గొన్నారు. రాయచోటి టౌన్ : 137వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలు రాయచోటి పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో ఐసిడిఎస్,్ విద్యుత్, బస్టాండ్, మున్సిపల్ కార్యాలయాల ఆవరణలో ఆరు చోట్ల సిఐటియు శ్రేణులు జెండా వందనం చేసి అమరవీరులకు నివాళి అర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లడుతూ నాడు కార్మికులు చికాగో నగరాల హే మార్కెట్ వద్ద పక్కటె ముకలు పగిలినా ప్రాణాలు పోయినా ఎనిమిది పనిగంటలు పని సాధించారని అన్నారు. కనీసవేతనం ఇఎస్‌ఐ, పిఎ, గ్రాట్యుటీ రిటైర్మెంట్ భెనిఫిట్స్, వేతనసవరణ వంటి నలభై నాలుగు రకాల కార్మిక సంక్షేమం కొరకు చట్టాలు హక్కులు సాధించారని నేటి ప్రభుత్వాలు యాజమాన్యాలకు అనుకూలంగా లేబర్ కోడ్లు తీసుకుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్యా లయం నుంచి తహశీల్దార్ కార్యా లయం మీదుగా ర్యాలీ నిర్వ హించి మానవహారం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి డి.భాగ్యలక్ష్మి రాంబాబు, విజయమ్మ, సిద్దమ్మ, సుమలత, ఇందిర, నాగమణి పార్వతి, సుబ్బమ్మ, సరస్వతి, సబీనా, లక్ష్మీ, ప్రసన్న, ఆశా రమాదేవి, అరుణ, సురేఖ, వైవి.రమణ, తిరు పాల్, సిద్దయ్య అశోక్, సురేంద్ర, రాజమ్మ పాల్గొన్నారు.కలకడ : మండల కేంద్రమైన కలకడలో 137వ శ్రామికుల దినోత్సవం సందర్భంగా మేడేని జెండాను ఆవిష్కరించి ఘనంగా నిర్వహించుకున్నారు. దేశంలో శ్రామికుల కష్టాలని ఎప్పటికీ ఎవరు గుర్తించలేని దయనీయ సంఘటనగా మారిందని సిఐటియు అనుబంధ సంస్థ పంచాయితీ కార్మికుల మండల అధ్యక్షులు హరి కొనియాడారు. ఇకనైనా ప్రభుత్వాలు కష్టజీవుల శ్రమను గుర్తించి వారికి శ్రమకు తగిన ఫలితం ఇచ్చేందుకు చొరవ తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో వెలుగు రెడ్డప్ప , నటరాజ, అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు, పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు. పీలేరు : పట్టణంలోని గ్రామపంచాయతీ కార్యాలయం, ఆర్‌టిస ిడిపో, ఆటో స్టాండ్‌ల వద్ద ప్రాంతాల్లో కార్మిక నాయకులు, కార్మికులు సంయుక్తంగా ఎర్రజెండాలు ఎగురవేశారు. కార్మిక స్వేచ్ఛా గీతాలాపన, నినాదాలు, వక్తలు అందించిన సందేశాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమాల్లో యుటిఎఫ్ రాష్ట్ర నాయకులు సదాశివరెడ్డి, చంద్రశేఖర్, చంగల్ రాయుడు, జి. రాధాకష్ణ, శంకరయ్య, వైసిపి నాయకులు కంభం భాస్కర్‌రెడ్డి, అంగన్వాడీ వర్కర్స్ రాష్ట్ర నాయకురాలు చిన్నమ్మ, వైసిపి జిల్లా మహిళా అధ్యక్షురాలు మహిత ఆనంద్ పాల్గొన్నారు. గాలివీడు : ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా కార్మికులు తహశీల్దార్ కార్యాలయం నుంచి గేటు వరకు ర్యాలీగా వచ్చి గేటు దగ్గర జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో గరుగుపల్లి విఆర్‌ఒ సుధాకర్, సిఐటియు జిల్లా కార్యవర్గ సభ్యులు ఓబులమ్మ, విఆర్‌ఎల జిల్లా కార్యదర్శి సభ్యుడు భోగిశ్వరయ్య, సిఐటియు మండల అధ్యక్షురాలు లక్ష్మీదేవి, సురేష్ కుమార్ అమీన్‌పీర్, రామాంజులు, మల్లికార్జున, దిల్షాద్ బేగం, రాణి, కార్మికులు పాల్గొన్నారు. బి.కొత్తకోట : పెద్దతిప్ప సము ద్రం గ్రామపంచాయతీ ఎంఆర్‌సి ప్రాంగణంలో మే డే సదర్భంగా గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఎర్రజెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి శంకర, అంగన్వాడీ వర్కర్స్ నాయకులు నలిని, శాంతమ్మ, శ్రీవాణి, ఈశ్వరమ్మ, సరస్వతి రాణి, అంజలి, సురేంద్ర, పంచాయతీ కార్మికులు రమణ, రామచంద్ర, ఆదెమ్మ, లక్ష్మి,నాగరాజు ,యస్.లక్ష్మి, హమాలీ కార్మికులు శంకర, రామాంజిలు పాల్గొన్నారు.యువతకు ఉద్యోగాలు కల్పించాలని, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విధానాలు రద్దు చేయాలని,12 గంటల పని విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలని, నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలని, పెట్రోల్,డీజిల్, వంట గ్యాస్ ధరలు తగ్గించాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ ఆపాలని, ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీలపై జరుగుతున్న దాడులు ఆపాలన్నారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలని, పోలవరం, రాజధాని నిర్మాణాలకు నిధులు ఇవ్వాలని, విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ ఆపాలని, భారీగా ప్రజలపై మోపిన ఇంటి పన్నులు, చెత్త పన్నులు, ఖాళీ స్థలాలపై పన్నులను తగ్గించాలని డిమాండ్ చేశారు., విద్యుత్ ఛార్జీలు, ఆర్‌టిసి ఛార్జీలు తగ్గించాలని నినాదులు చేస్తూ ర్యాలీ చేపట్టారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా మాజీ అధ్యక్షులు ఎస్.మనోహర్‌రెడ్డి ఏఐటియుసి పతాకాన్ని ఎగుర వేశారు. కార్యక్రమంలో ఎఐటియసి నాయకులు ఎస్.సలీంభాష, మండల అధ్యక్ష, కార్యదర్శులు ఎం.అష్రప్ అలీ, ఎస్.తంబ య్యశెట్టి పాల్గొన్నారు. లక్కిరెడ్డిపల్లి : ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాం జనేయులు జెండాను ఆవిష్కరించారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కార్మిక, కర్షక, రైతులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రామాంజులు, జె.సుకుమారి, ఓబుళమ్మ, ప్రభావతి, ప్రాజె క్టులోని ఐదు మండలాల సెక్టార్ లీడర్లు పాల్గొ న్నారు. చిట్వేలు: వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పందికాళ్ళ మణి ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి అన్ని సంఘాల కార్మికులతో కలిసి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనం తరం స్థానిక మండలం ఉప సర్పంచ్ ఉమామహేశ్వర్‌రెడ్డి సిఐ టియు జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సిఐటియు అధ్యక్ష కార్యదర్శుల కె.నాని, యదురూరి సుజాత, కెవిపిఎస్ జిల్లా కన్వీనర్ ఓబిలి పెంచలయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు బొజ్జ శివయ్య, కే శివనందు,ఒలిమి నాగయ్య, అంగన్వాడీ వర్కర్స్ , హెల్పర్స్, మ్యాక్సీ అండ్ ఆటో యూనియన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.నందలూరు: కార్మికుల దినోత్సవం సందర్భంగా సోమవారం గొల్లపల్లి లోని అప్పర్ ప్రైమరీ స్కూల్‌లో మధ్యాహ్న భోజన ఏజెన్సీ జిల్లా అధ్యక్షులు ఆదినారాయణ, మధ్యాహ్న భోజన ఏజెన్సీ మండల అధ్యక్షుడు సాంబశివయ్య ఆధ్వర్యంలో జెండాను ఎగురవేసి మేడే దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న ఎనిమిది గంటల పనిదినాలను 12 గంటలకు పెంచితే సహించేది లేదన్నారు. మరో చికాగో ఉద్యమం తప్పదని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షురాలు అమరావతి, నల్ల తిమ్మయ్య గారి పల్లి వంట ఏజెన్సీ నిర్వాహకులు మునిస్వామి, మహేష్, కార్మికులు పాల్గొన్నారు. నిమ్మనపల్లి : మండల పరిధిలోని జి.వడ్డిపల్లిలో వ్యవసాయ వత్తిదారుల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శోభ ఆధ్వర్యంలో ఉపాధి కూలీలతో కలసి మేడే నిర్వహించారు. గ్రామంలో మేడే వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఉపాధి కూలీలకు 200 రోజుల పని దినాలను కల్పించాలని, కనీస వేతనం రూ.850 ఇవ్వాలని అన్నారు. కార్యక్రమంలో ఎపివివియు మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.










