ప్రజాశక్తి - హెల్త్ యూనివర్శిటీ : కృష్ణాజిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోరంకిలోని స్కాట్ స్పైన్ స్కూల్‌లో జరిగిన జిల్లా స్థాయి చెస్ పోటీలు ఉత్సాహభరితంగా జరిగాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వివిధ ఏజ్ గ్రూపు విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో 100 మందికిపైగా విద్యార్థులు పాల్గొన్నారని చెస్ అసోసియేషన్ సెక్రటరీయన్ యం.ఫణికుమార్ తెలిపారు. ఈ పోటీలలో ఎంపికైన క్రీడాకారులు అక్టోబరు 15 నుండి నంద్యాలలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో కృష్ణా జిల్లా జట్టు తరపున పాల్గొంటారని తెలిపారు. సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రంలో స్కాట్ స్పైన్ స్కూల్ సీఈవో కె.జాహ్నవి, స్కూల్ ప్రిన్సిపాల్ సి.హెచ్.ప్రతిమ, పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఆర్‌ఆర్ చెస్ కోచింగ్ అకాడమి అధ్యక్షురాలు జె.సౌజన్య, కొటాక్ బ్యాంక్ మేనేజర్ వరప్రసాద్, గుడివాడ చెస్ మేనేజర్ సుమన్, కృష్ణా జిల్లా చెస్ మేనేజర్ రామకృష్ణ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా విజేతల వివరాలను నిర్వాహకులు తెలియచేశారు.
విజేతలు....
అండర్ -6 బాలికల గ్రూప్‌లో డివిషా చౌదరి, జ్ఞాన సంపద, అస్విక మొదటి మూడు స్థానాలు సాధించగా, బాలుర విభాగంలో సుహ్రిత్.కె, దక్షిత్ కుమార్, రేయాన్ష్ శ్రీ మొదటి మూడు స్థానాలు సాధించారు. అండర్ -8 కు సంబంధించి బాలికల విభాగంలో వెనోరి సామ్, స్రుతిక, యశశ్వి, మొదటి మూడు స్థానాలు సాధించగా, బాలుర విభాగంలో శ్రీ వశిష్ట, శ్రేయాష్, అశ్విక్ జారు, మొదటి మూడు స్థానాలు సాధించారు. అండర్ -10 ఏజ్ గ్రూప్ బాలికల విభాగంలో సోనిక సాయి, సంజన, లీనా షారోజ్ మొదటి మూడు స్థానాలు సాధించగా, బాలుర విభాగంలో తేజా వజ్రాక్ష, అభిరామ్, సుహాస్ మొదటి మూడు స్థానాలు సాధించారు. అండర్ -12 ఏజ్ గ్రూప్‌లో బాలికల విభాగంలో జోస్లిన్ ప్రహర్ష, గీతార్థ, లౌక్య మొదటి మూడు స్థానాలు సాధించగా, బాలుర విభాగంలో తాడి జివితేష్, దేవేష్, దుర్గా కృష్ణా మొదటి మూడు స్థానాలు సాధించారు. అండర్ -14 ఏజ్ గ్రూప్‌లో బాలికల విభాగంలో సంజన ప్రియ, లికిత ఎం.విష్ణు ప్రియ, మొదటి మూడు స్థానాలు సాధించారు. బాలుర విభాగంలో తిజేష్ నాగ్ మునగాల, పూరజ్ నాగ్, దానిష్ మొదటి మూడు స్థానాలు సాధించారు. అండర్ -16 ఏజ్ గ్రూప్ బాలుర విభాగంలో వెంకట రాహుల్ ప్రథమ స్థానం సాధించాడు.










