Nov 14,2023 23:36

మాట్లాడుతున్న ఎమ్మెల్యే సుధాకర్‌బాబు

ప్రజాశక్తి-మద్దిపాడు : ఉపాధి హామీ చట్టం ద్వారా ప్రతి ఒక్కరికీ పనులు కల్పించటమే థ్యేయంగా ఎపిఒలు పని చేయాలని ఎమ్మెల్యే టిజెఆర్‌. సుధాకర్‌ బాబు అన్నారు. మండల పరిధిలోని మల్లవరంలో వైఎస్‌ఆర్‌ విజయ భవనంలో జాతీయ ఉపాధి హామీ పథకంపై నియోజక వర్గ పరిధిలోని 4 మండలాల ఎపిఒలతో ఎమ్మెల్యే సుధాకర్‌ బాబు మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉపాధి హామీ చట్టం ద్వారా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన కార్యక్రమాలు నియోజకవర్గంలో విజయవంతంగా అమలు చేస్తున్న తీరుపై సమీక్షించారు. లక్ష్యాలు చేరే దిశగా పనులు జరుగుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఉపాధి మే ట్లు, కూలీలకు సరిపడా పనులు కల్పించడం, యాక్షన్‌ ప్లాన్‌,బడ్జెట్‌ రూప కల్పనలలో తీసుకుంటున్న చర్యలు గురించి వివరాలు అడిగారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులలో ఎన్‌ఆర్‌జిఎస్‌ వాటా కింద ఎంత నిధులు నియోజకవర్గంలో ఖర్చు చేశారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాలకు చెందిన ఎపిఒలు పాల్గొన్నారు.