ఉపాధి హామీ పనులు పరిశీలన
ప్రజాశక్తి-ఉదయగిరి : ఉపాధి హామీ కూలీలు చేపడుతున్న పని ప్రదేశాలను పనులను ఎంపిడిఒ ఐజాక్ ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. మంగళవారం స్థానిక చిన్న చెరువు పనులను ఎంపిడిఒ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి కూలీలు కొలతల ప్రకారము పని చేయాలని సూచించారు. ప్రభుత్వం రూ.257 నుండి రూ.272లకు రోజువారీ వేతనాన్ని పెంపుదల చేసినందున ఉపాధి కూలీలు ఈ విషయాన్ని గమనించి ఎక్కువ వేతనం పొందే విధంగా పని చేయాలన్నారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఉదయం 6 గంటలకే పని ప్రారంభించి ఉదయం 11 గంటల లోపు పనులు పూర్తి చేసుకోవాలని ఎండతీవ్రతను తప్పించుకోవాలన్నారు. గ్రూపుల వారీగా పనులు విభజించి ముందుగా మార్కింగ్ ఇచ్చి ఉపాధి కూలీలు పనులు చేసే లాగా టెక్నికల్, ఫీల్డ్‌అసిస్టెంట్లు తగినచర్యలు తీసుకోవాలని సూచించారు. పని ప్రదేశంలో తాగునీరు, నీడ ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలని సిబ్బందికి తెలియజేశారు.










