Dec 27,2022 18:44

ఉమ్మడిశెట్టి.నాగేశ్వరరావును సత్కరిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి -కందుకూరు : మంచుపొగ కవి ఉమ్మడిశెట్టి.నాగేశ్వరరావు అమ్మ కవితకు పురష్కారం లభించింది. వురిమిళ్ల ఫౌండేషన్‌ ఖమ్మం వారు నిర్వహించిన వురిమిళ్ల పద్మజా స్మారక జాతీయ స్థాయి 2022 కవితా పోటీల్లో ప్రోత్సాహక బహుమతి ఉమ్మడిశెట్టి.నాగేశ్వరరావుకు లభించింది. ఈ సందర్భంగా జాషువా సాహిత్య సాంస్కతిక సంస్థ అద్యక్షులు ముప్పవరపు కిషోర్‌, సెక్రటరీ చనమాల కోటేశ్వరరావు ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగేశ్వరరావు సమాజ హితమైన కవిత్వం రాయాలని అభిలషించారు. మరిన్ని పురష్కారాలు పొందాలని కోరారు. వురిమిళ్ల వ్యవస్థాపకులు సునంద చేతుల మీద ఉమ్మడిశెట్టి.నాగేశ్వరరావును సన్మానించారు. పురస్కారం ప్రదానం చేశారు.