Oct 13,2023 12:52

ప్రజాశక్తి-చిత్తూరు జిల్లా : నగరిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా నగరి ఏరియా ఆసుపత్రి వద్ద టీడీపీ నగరి ఇన్ చార్జ్ గాలి భానుప్రకాష్ కారుపై  వైసిపి నేతలు దాడి చేశారు. గాలి భాను కారును వైసీపీ కార్యకర్తలు అడ్డుకుని కారు అద్దాలు ధ్వంసం చేశారని ఆరోపిస్తున్నారు. కాపు సంక్షేమం సంఘం ఏర్పాటు చేసి, రైతులకు అన్నదానం కార్యక్రమానికి వెలుతున్న సందర్భంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దాడి అనంతరం ఘటనా స్థలం నుంచి భాను వెళ్లిపోయారు. రోజాపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా దాడి చేసినట్లు కార్యకర్తలు తెలిపారు. దీంతో ఘటన స్దలానికి టిడిపి కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గాలి భానుపై దాడి చేసిన  వైసిపి నేతలు వెంటనే అరెస్ట్ చేయాలని నగరి ఏరియా హాస్పిటల్ వద్ద టిడిపి నాయకులు ఆందోళనకు దిగారు. హైవేపై టీడీపీకి నాయకులు నిరసన వ్యక్తం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.  దీంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీంతో హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.