Sep 30,2023 22:15
  • లోకేష్‌కు సిఐడి నోటీసులు
  • 4న విచారణ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ టిడిపి నేతలు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా శనివారం శబ్దాలు చేసి తమ నిరసన తెలియజేశారు. పార్టీ పిలుపునిచ్చిన మోత మోగిద్దాం కార్యక్రమంలో భాగంగా రాత్రి 7 నుంచి 7.05 గంటల వరకు డ్రమ్స్‌, విజిల్స్‌, గంటలు, ప్లేట్లు, బూరలు వంటి వాటితో నిరసన వ్యక్తం చేశారు. టిడిపి కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కె అచ్చెనాుయుడు, పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, వర్ల రామయ్య, మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, నక్కా ఆనంద్‌బాబు, గంటా శ్రీనివాసరావు, పీతల సుజాత తదితరులు నిరసనలో పాల్గొన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఢిల్లీలోని టిడిపి ఎంపి గల్లా జయదేవ్‌ కార్యాలయం వద్ద గంట కొట్టి నిరసనలో పాల్గనాురు. చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి హైదరాబాద్‌లో తన నివాసంలో డ్రమ్స్‌ వాయించారు. లోకేష్‌ భార్య బ్రాహ్మణి రాజమండ్రిలో విజిల్‌ ఊదడంతో పాటు డ్రమ్స్‌ కూడా వాయించారు.
అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు ఎపిసిఐడి నోటీసులు అందజేసింది. ఢిల్లీలోని టిడిపి ఎంపి గల్లా జయదేవ్‌ కార్యాలయంలో లోకేష్‌ను కలిసి 41ఎ కింద సిఐడి అధికారులు నోటీసు అందజేశారు. అక్టోబరు 4న గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉన్న సిఐడి కార్యాలయానికి ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. నోటీసులు అందుకున్నట్లు లోకేష్‌ అధికారుల వద్ద సంతకం చేశారు. ఇనుర్‌ రింగ్‌రోడ్డు కేసులో లోకేష్‌ను ఎ14గా సిఐడి పేర్కొను విషయం తెలిసిందే. అంతకుముందు వాట్సాప్‌ ద్వారా కూడా సిఐడి అధికారులు నోటీసులు అందజేశారు.

  • సంబంధం లేని కేసులో ఇరికించారు : లోకేష్‌

ఇనుర్‌ రింగ్‌ రోడ్డులో తన పాత్ర లేదని, ఎలాంటి సంబంధం లేని వ్యక్తులను కేసులో ఇరికించారని లోకేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. హెరిటేజ్‌లో తను షేర్‌ హోల్డర్‌ను మాత్రమే అని మీడియాతో చెప్పారు. తమ ఆస్తులు ప్రకటించిన వాటి కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా ప్రభుత్వానికి రాసిస్తానని అనాురు. అక్రమ కేసులతో టిడిపిని అడ్డుకోవాలని చూస్తున్నారని, అందులో భాగంగానే చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని విమర్శించారు. తను ఎక్కడికీ పారిపోలేదని, ధైర్యంగా కేసులను ఎదుర్కొంటానని చెప్పారు.
నాలుగేళ్ల పాలనలో వైద్య రంగాన్ని భ్రష్టు పట్టించిన సిఎం జగన్‌ 'జగనన్న సురక్ష' పేరుతో ప్రచారార్భాటం చేయడం సిగ్గుచేటని టిడిపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి విమర్శించారు. డెంగ్యీ, మలేరియా వంటి జ్వరాలతో ప్రజల ప్రాణాలు పోతునాు పట్టించుకోకుండా కక్షలుతో ప్రత్యర్థులను అన్యాయంగా జైలు పాల్జేస్తున్నారని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో ఎస్‌ఐ, సిఐల ఉద్యోగోన్నతుల్లో జరిగిన అవినీతిలో సిఐడి డిజి సంజయ్ ఉన్నారని, ఎసిబి దాడుల్లో వెలుగులోకి వచ్చిందని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శించారు. టిడిపి కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. డిజిపి కార్యాలయంలో ఎసిబి జరిపిన సోదాలు, విచారణకు సంబంధించిన నివేదిక బయటపెట్టే ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా? అని ప్రశిుంచారు. రాష్ట్రంలో జరుగుతున్న మద్యం తయారీ, రవాణా, విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే సిబిఐ విచారణ జరిపించాలని టిడిపి అధికార ప్రతినిధి సయ్యద్‌ రఫీ డిమాండ్‌ చేశారు.