ప్రజాశక్తి-విజయవాడఅర్బన్: దసరా సెలవుల్లో తరగతులు నిర్వహించే విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు సోమేశ్వరరావు జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు ఎం.సోమేశ్వరరావు మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నా ప్రవేటు, కార్పొరేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్నారని ఆమెకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ, ప్రవేటు, కార్పొరేట్, ఎయిడెడ్ పాఠశాలలకు ఈ నెల 24 నుంచి అక్టోబర్ 6 వరకు దసరా సెలవులు ప్రకటించారు.కానీ విజయవాడ నగరంలో మరియు జిల్లా వ్యాప్తంగా విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు. మరియు ప్రభుత్వ నిబంధనకు విరుద్ధంగా తరగతులు నిర్వహించే విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకొని ఆసంస్థ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తరగతులు నిర్వహించే పాఠశాలల వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు. విద్యాశాఖ అధికారులు కూడా తనిఖీలు నిర్వహించి చర్యలు చేపట్టాలని కోరారు.










