Apr 18,2023 21:38

ఫొటో : టిడిపిలోకి శ్రీనివాసులు ఆహ్వానిస్తున్న టిడిపి నేతలు

టిడిపిలోకి విశ్రాంత ఏఈ శ్రీనివాసులు
ప్రజాశక్తి-కావలి : 25వ వార్డుకు చెందిన రిటైర్డ్‌ ఆర్‌అండ్‌బి అసిస్టెంట్‌ ఇంజనీర్‌ నాగిశెట్టి శ్రీనివాసులు మంగళవారం టిడిపి కార్యాలయంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు మన్నవ రవిచంద్ర ఆధ్వర్యంలో మాలేపాటి సుబ్బానాయుడు నాయకత్వాన్ని బలపరుస్తూ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సుబ్బానాయుడు మాట్లాడుతూ నాగిశెట్టి శ్రీనివాసులు పార్టీలో చేరడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. స్వతహాగా ఎన్‌టిఆర్‌ వీరాభిమాని అయిన శ్రీనివాసులు పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో పని చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత వైసిపి విధానాలు నచ్చక, ఈ రాష్ట్రాన్ని సమర్థవంతంగా పాలించగల ఒకేఒక్క నాయకుడు చంద్రబాబు నాయుడు అన్న నమ్మకంతో ఈ పార్టీలో చేరుతున్నానని నాగిశెట్టి శ్రీనివాసులు వెల్లడించారు.
కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పోతుగంటి అలేఖ్య, పట్టణ పార్టీ ఉపాధ్యక్షులు గుత్తికొండ కిషోర్‌ బాబు, యూనిట్‌ ఇన్‌ఛార్జులు శానం హరి, కుందుర్తి కిరణ్‌ కుమార్‌, ఏ వెంకటేశ్వర్లు నాయుడు, షేక్‌ మస్తాన్బూత్‌, కన్వీనర్లు కమ్మిశెట్టి వెంకటరమణయ్య, కోసూరు సురేష్‌, పులిమి నరసింహారెడ్డి, గుండాబత్తిన నందకుమార్‌, గోపిశెట్టి సుబ్రహ్మణ్యం, పోలిశెట్టి మాలకొండయ్య, గుర్రాల వెంకటేశ్వర ప్రసాద్‌, నేలపాటి కొండలరావు, షేక్‌.సుభాని, ఎండ్లూరి కొండపనాయుడు, ఎండ్లూరి సురేష్‌, వల్లూరు చెన్నకేశవులు, పులివర్తి రాజశేఖరరావు, తదితరులు పాల్గొన్నారు.