Feb 23,2023 19:00

ఇంటూరి నాగేశ్వరరావు

ప్రజాశక్తి -కందుకూరు  నెల్లూరులో గురువారం జరిగిన టిడిపి నెల్లూరు పార్లమెంట్‌ సమన్వయ కమిటీ సమావేశానికి కందుకూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు హాజరయ్యారు. పార్లమెంట్‌ అధ్యక్షులు షేక్‌ అబ్దుల్‌ అజీజ్‌, పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ దివి శివరాం, పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికలు, ఇంకా పలు విషయాలపై నేతలు చర్చించారు.