మచిలీపట్నం : మాజీ మంత్రి, టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మచిలీపట్నం చింతచెట్టు సెంటర్‌లో మున్సిపల్ అధికారులు ఆక్రమణల తొలగింపు చేపట్టారు. దీంతో టిడిపి సానుభూతిపరుల దుకాణాలు తొలగిస్తున్నారంటూ బాధితులకు కొల్లు రవీంద్ర మద్దతుగా నిలిచారు. ఘటనాస్థలంలోనే బైఠాయించడంతో టిడిపి కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేశారు.










