Feb 23,2023 18:55

మాట్లాడుతున్న డిఎస్‌పి కండే శ్రీనివాసులు

ప్రజాశక్తి -కందుకూరు  కందుకూరు టిఆర్‌ఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో గురువారం కందుకూరు డివిజనల్‌ సూపర్డెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ కండే శ్రీనివాసులు ఎస్‌పి ఆదేశాల మేరకు కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమంలో నిర్వహించారు. డిఎస్‌పి కె శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ మంచి నడవడికను అవలంభించుకోవాలని, తల్లిదండ్రులను గౌరవించాలన్నారు. సెల్‌ ఫోను వాడకము తగ్గించి వ్యసనానికి బానిస కావొద్దు అని అన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థులకు వ్యాయామం చాలా అవసరమని అవకాశం దొరికినప్పుడు వ్యాయామం చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలిపారు. సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌ జి వెంకట్రావు, సబ్‌ ఇన్స్పెక్టర్‌ కిషోర్‌ బాబు, కళాశాల ఇంచార్జ్‌ ప్రిన్సిపల్‌ టి సుబ్బారావు పాల్గొన్నారు.