ఫొటో : నగర పంచాయతీ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న ప్రజలు
తాగునీటి కోసం ఆందోళన
ప్రజాశక్తి-అల్లూరు : మండల కేంద్రం స్థానిక నగర పంచాయతీ కార్యాలయం వద్ద శుక్రవారం క్రిస్టియన్ పేట, కోళ్లఫార సంఘం, పేరంటాలమ్మ తోపుకు చెందిన పలువురు గ్రామస్తులు గతవారం నుండి తాగునీరు సరఫరా కాకపోవడంతో కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. గ్రామస్తులు మాట్లాడుతూ అవసరాలకు సకాలంలో నీరు సరఫరా కాకపోవడంతో తీవ్రఇక్కట్లు ఎదుర్కొంటున్నామని మాగోడు పట్టించుకునే నాథుడే కరువయ్యారని దుయ్యబట్టారు. అనేకమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేదని తెలిపారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలంటే డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నగర పంచాయతీ కమిషనర్ ఫణికుమార్ మాట్లాడుతూ సమస్యను సత్వరమే పరిష్కరిస్తామని హామీనిచ్చారు. ఏఈ ద్వారా పైపులైన్లు పరిశీలించి తాగునీరు వచ్చే విధంగా కృషి చేస్తామన్నారు.










